తెదేపా హయంలో ఉపయోగంలో లేని.. తితిదే 50 ఆస్తులను విక్రయించేందుకు ఓ కమిటీ వేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తితిదే ఆస్తులను ప్రభుత్వం అమ్మేస్తోందంటూ మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. దేవస్థానం ఆస్తులు అమ్మితే.. జగన్మోహన్రెడ్డికి, వెలంపల్లి శ్రీనివాసరావుకి ఒక్కరూపాయి కూడా రాదని, చీకటి జీవోలు ఇచ్చి భూములు అమ్మేసే ఆలోచన తమకు లేదన్నారు.
ఆస్తులమ్మితే.. మాకు వచ్చేదేమీ లేదు: వెల్లంపల్లి
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు.. విక్రయించినా డిపాజిట్లుగానే పొందుపరుస్తామని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. తెదేపా హయంలో తితిదేలో ఉపయోగం లేని భూములను వేలం వేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు.
minister vellampalli on ttd assets
సదావర్తి భూములను చంద్రబాబు దొంగచాటుగా వేలం వేసిన లాంటి చర్యలు తమ ప్రభుత్వం చేయదని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో దేవుడి గుళ్లు అన్ని కూల్చేశారని విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి రూ.500 కోట్ల నిధులు కేటాయించడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తెదేపా 5 ఏళ్ల పాలన, తమ ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చకు తాము సిద్ధమని.. వెల్లంపల్లి సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: 2016లోనే తెదేపా ఆ జీవో తెచ్చింది: సుచరిత