ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేవాలయ భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదు : వెల్లంపల్లి - మంత్రి వెల్లంపల్లి తాజా వార్తలు

తెదేపా-భాజపా ప్రభుత్వ హయాంలోనే ఆలయాలు కూల్చివేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. గతంలో భాజపాకు చెందిన నేత దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆలయాల భూములు అప్పన్నంగా కట్టబెట్టారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాలు కూల్చినప్పుడు సోము వీర్రాజు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వంలో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదని స్పష్టం చేశారు.

Minister vellampalli
Minister vellampalli

By

Published : Dec 16, 2020, 7:55 PM IST

Updated : Dec 16, 2020, 10:33 PM IST

దేవాలయ భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదు : వెల్లంపల్లి

రాష్ట్రంలో దేవాలయాల కూల్చివేతపై ఆరోపణలు, ఆందోళనలు చేస్తోన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు .. వాటిని ఎవరు కూల్చారో తెలుసుకుని మాట్లాడాలని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. గతంలో తెదేపా-భాజపా ప్రభుత్వంలో భాజపా నేత మాణిక్యాలరావు దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేవాలయాలు కూల్చేశారని అన్నారు. ఇవాళ సర్జికల్ స్ట్రైక్ అని మాట్లాడే భాజపా నేతలు ఆరోజు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

'గతంలో విజయవాడలో దేవాలయాలు కూల్చినప్పుడు నేను భాజపాలోనే ఉన్నాను. ఆలయాల కూల్చివేతను వ్యతిరేకిస్తూ విజయవాడ బంద్‌కు పిలుపునిచ్చాను. బంద్‌తో పార్టీకి సంబంధం లేదని అప్పట్లో భాజపా ప్రకటన చేసింది. దేవాలయాల భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదు.'

--వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర మంత్రి

ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక విధంగా... లేనప్పుడు మరో విధంగా భాజపా నేతలు మాట్లాడటం సరికాదన్నారు. కూల్చిన వాటిల్లో పలు దేవాలయాల పునర్నిర్మాణంపై ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చిందన్నారు. ప్రభుత్వానికి పేరు రాకుండా ఉండేందుకే రాజకీయ లబ్ధికోసం ఆరోపణలు చేస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. భాజపా నేత మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో పలు దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయని ధ్వజమెత్తారు. కనీసం కార్పొరేటర్​గా కూడా గెలవలేని సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి తమపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదన్నారు. దేవాలయాలపై దాడులు ప్రతిపక్షాల కుట్రేనని మంత్రి ఆరోపించారు. ప్రజల మధ్యవిద్వేషాలు రెచ్చగొట్టవద్దని సూచించారు

ఇదీ చదవండి :'అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది'

Last Updated : Dec 16, 2020, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details