ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మేధోమథన సమీక్షకు సిద్ధంగా ఉండాలి: మంత్రి సురేశ్ - ఏపీ ప్రభుత్వ మేధోమథన సమీక్ష వార్తలు

రాష్ట్ర ప్రగతిపై ఈ నెల 25 నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్​తో మేధోమథన సమీక్ష కార్యక్రమం జరగనుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

minister suresh review on education
minister suresh review on education

By

Published : May 20, 2020, 8:31 PM IST

విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు సంబంధించి 5 రోజులపాటు జరుగనున్న మేధోమథన కార్యక్రమంలో చర్చించనున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. సీఎంతో జరిగే ఈ సమీక్షను విజయవంతం చేసేందుకు విద్యాశాఖకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పనపై ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ కార్యక్రమం నిర్వహణపై సీనియర్ అధికారి ఛైర్మన్​గా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. 1. అమ్మఒడి, 2. మౌలిక సదుపాయాల రూపకల్పన, 3.విద్యాప్రమాణాలు పెంపు, 4.ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లవిద్య, 5.మాతృభాషా వికాసం, 6.పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, పాదరక్షలు, 7.నైపుణ్యాభివృద్ధి, 8.ప్రైవేటు విద్యాసంస్థలపై రెగ్యులేటరీ కమిషన్, 9. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకం వంటి అంశాలను మంత్రి సమావేశంలో ప్రస్తావించారు.

ఇదీ చదవండి: ఈ నెల 25 నుంచి మేధోమథన సదస్సులు

ABOUT THE AUTHOR

...view details