18వ తేదీ అర్ధరాత్రి నుంచి వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా మొత్తం 16 వేల పోస్టులు బ్లాక్ చేశామని మంత్రి తెలిపారు. బ్లాకింగ్ ప్రక్రియ లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా 4008 పోస్టులు ఖాళీగా మిగిలిపోయే పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ కోసం 74,418 మంది ఐచ్ఛికాలను ఇచ్చారని మంత్రి తెలిపారు.
రేపు అర్ధరాత్రి వరకు ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లు: మంత్రి సురేశ్ - ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లు న్యూస్
ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లను రేపు అర్ధరాత్రి వరకూ నమోదు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. అలాగే ఆప్షన్లను మార్చుకునేందుకు కూడా రేపు అర్ధరాత్రి వరకూ అవకాశముందని మంత్రి తెలిపారు.
రేపు అర్ధరాత్రి వరకు ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లు: మంత్రి సురేశ్
ఉపాధ్యాయ సంఘాలతో విధానపరమైన నిర్ణయాలపై చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. ఉపాధ్యాయ సంఘాల పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే మన్నించాల్సిందిగా మంత్రి కోరారు. ఇంజినీరింగ్ ఫీజులు గత ఏడాది తరహాలోనే ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. తుది నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తామని.. అలాగే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను కూడా రేపు ప్రకటించనున్నట్టు మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి:పిండ ప్రదానానికి వెళ్లి.. పెన్నా నదిలో ఏడుగురు గల్లంతు
TAGGED:
teachers transfer in ap news