Ukraine Crisis: ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఉక్రెయిన్లోని తెలుగు విద్యార్థులను స్వరాష్ట్రనికి రప్పించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్.. కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ విమాన సర్వీసులు రద్దయ్యాయని,ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు సహాయం కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్ని నియమించినట్లు చెప్పారు. ఏపీ భవన్లో అధికారులను అప్రమత్తం చేశామని.. పరిస్థితులు చక్కబడగానే విద్యార్థులను రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
సంప్రదించాల్సిన నంబర్లు..
- నోడల్ అధికారిగా(ఏపీ భవన్) రవి శంకర్- 9871999055
- అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గీతేష్ శర్మ- 7531904820
- ఏపీఎన్ఆర్టీ సీఈవో దినేశ్ కుమార్ -9848460046