ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జాతీయ విద్యావిధానం కంటే ఎక్కువే మేం అమలు చేస్తున్నాం' - జాతీయ విద్యావిధానంపై మంత్రి సురేశ్ కామెంట్స్

34 ఏళ్లతర్వాత జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర కేబినెట్ అనుమతి పొందిందని.. మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. దీనిపై రాష్ట్రంలో విద్యాశాఖలోని పాఠశాల, ఉన్నత విద్యాశాఖలు సహా ఇతర అధికారులతో చర్చించామన్నారు. నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని సమర్థిస్తున్నామని మంత్రి చెప్పారు.

minister-suresh-on-new-education-policy
minister-suresh-on-new-education-policy

By

Published : Jul 30, 2020, 7:26 PM IST

కేంద్రం రూపొందించిన ముసాయిదా పాలసీపై చర్చించి సూచనలు సలహాలు తీసుకున్నామని.. మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో విద్యా విధానంలో చేసిన మార్పులను కేంద్రానికి తెలియజేశామన్నారు. జాతీయ విద్యా విధానం ముసాయిదాలో రాష్ట్రంలో తీసుకున్న పలు కార్యక్రమాలు కనిపిస్తున్నాయని మంత్రి తెలిపారు. విద్యావ్యవస్థ ఎలా ఉండాలో సీఎం జగన్ విస్తృతంగా చర్చించి నిర్ణయించారని.. సీఎం జగన్ ఆలోచన విధానం కేంద్రం రూపొందించిన ముసాయుదా లో కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ఏడాది క్రితమే మానవ వనరుల శాఖను విద్యాశాఖగా సీఎం జగన్ మార్చారని పేర్కొన్నారు. ఏడాది తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా మానవ వనరుల శాఖను విద్యాశాఖగా మార్చిందన్నారు.

'మేం సూచించిన 2 అంశాలు సహా పలు అంశాలు పొందుపరిచారు. అమ్మఒడిని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రాన్ని కోరాం. దేశంలో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్‌ పెట్టాలని కేంద్రానికి సూచించాం. కేంద్రం నూతన విద్యా విధానం ముసాయిదా బిల్లులోని అంశాలను రాష్ట్రంలో అమలు చేస్తాం. జవాబుదారితనం, పారదర్శకత,లక్ష్యంగా విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు పై కసరత్తు చేస్తున్నాం. నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మేము సమర్థిస్తున్నాం. నూతన విద్యా విధానంలో పొందుపరిచిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తాం.' మంత్రి సురేశ్ చెప్పారు.

విద్యావ్యవస్థలో సంస్కరణలకు కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. ఇప్పటికే 1-6 తరగతి వరకు తెలుగు ,ఆంగ్లం మాద్యమం పాఠ్య పుస్తకాలు ప్రచురించాం. 6 వతరగతి ఆ పై తరగతులకు కూడా తెలుగు, ఆంగ్ల మాద్యమం పాఠ్య పుస్తకాలను ప్రచురించాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఆంగ్ల మాద్యమంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన కేసును కొనసాగిస్తాం.ఆంగ్ల మాద్యమాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తాం. - ఆగస్టు చివరి కల్లా రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరవాలని సీఎం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ ప్రారంభంలో పాఠశాలలు తెరిచేముందు మరోసారి పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటాం.

- మంత్రి ఆదిమూలపు సరేశ్

ఇదీ చదవండి: దేశంలో కరోనా రికవరీ రేటు 64.4 శాతం

ABOUT THE AUTHOR

...view details