ఇకపై ఇంటర్ ప్రైవేట్ కళాశాలల్లో ఒక్కో సెక్షన్‌కు పరిమిత సంఖ్యలో విద్యార్థులకు అనుమతించనున్నారు. విద్యా సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేశామన్నారు. సెక్షన్‌కు 40 మందిని మాత్రమే చేర్చుకునేలా పరిమితులు కల్పించినట్లు వెల్లడించారు. రెండేళ్లకు కలిపి 720 మందిని మాత్రమే.. చేర్చుకునేలా... పరిమితులు ఉండనున్నాయన్నారు. గతంలో గరిష్ఠంగా ఉన్న 1584 మంది సంఖ్యను కుదించినట్లు మంత్రి సురేశ్ పేర్కొన్నారు.
ఇకపై ఒక్క సెక్షన్‌కు 40 మంది విద్యార్థులే:మంత్రి సురేశ్ - ప్రైవేటు కాలేజీలపై మంత్రి సురేశ్ కామెంట్స్
ఇంటర్ ప్రైవేట్ కళాశాలల్లో ఒక్కో సెక్షన్‌కు పరిమిత సంఖ్యలో విద్యార్థులకు అనుమతి కల్పించనున్నారు. గతంలో జారీచేసిన ఉత్తర్వులను సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
![ఇకపై ఒక్క సెక్షన్‌కు 40 మంది విద్యార్థులే:మంత్రి సురేశ్ minister suresh on intermediate students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7383085-520-7383085-1590667192870.jpg)
minister suresh on intermediate students
TAGGED:
ap inter board latest news