ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Adimulapu Suresh: 'తెలుగు - సంస్కృత అకాడమీ ఏర్పాటు చేస్తే రాద్ధాంతం ఎందుకు?'

తెలుగు భాషాభివృద్ధిని విస్తృతం చేసేందుకే కేబినెట్​లో చర్చించి తెలుగు - సంస్కృత అకాడమీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావటం లేదని చెప్పారు.

minister Suresh Comments on Telugu Sanskrit Academy
తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటు చేస్తే రాద్ధాంతం ఎందుకు ?

By

Published : Jul 14, 2021, 5:21 PM IST

Updated : Jul 14, 2021, 7:25 PM IST

'తెలుగు - సంస్కృత అకాడమీ ఏర్పాటు చేస్తే రాద్ధాంతం ఎందుకు?'

తెలుగు - సంస్కృత అకాడమీని ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావటం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. తెలుగు భాషాభివృద్ధిని విస్తృతం చేసేందుకే కేబినెట్​లో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ద్రావిడ భాష నుంచి ఆవిర్భవించిన తెలుగులో పరిశోధన కోసం సంస్కృతాన్ని కూడా జోడించి అకాడమీ ఏర్పాటు చేశామని చెప్పారు.

కుహనా మేధావులు జీవో నెంబర్ 31ని వ్యతిరేకిస్తున్నారు. తెలుగు అకాడమీ తెలుగుదేశం అకాడమీ కాదని గుర్తించాలి. తెదేపా నేతలు తమ విమర్శలు సరి చేసుకోవాలి. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు దీనిని ఏర్పాటు చేశారు. చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీ అస్థిత్వాన్ని కోల్పోయింది. సంస్కృతం భారతీయ భాషలకు మూలం. దీని ప్రభావం తెలుగుపై చాలా ఎక్కువ. రెండు భాషలు వేర్వేరుగా చూడలేం. తెలుగు భాష మూలాలను తెలుసుకోవాలంటే పరిశోధన అవసరం. తెలుగు అకాడమీ ఆస్తుల పంపకంపై తెలంగాణతో చర్చించాం. విభజన చట్టం మేరకు రూ.200 కోట్ల వరకు నిధులు రావాలి. తెలుగు అకాడమీ పబ్లికేషన్స్ డివిజన్‌ను గతంలో మూసేశారు. పోటీ పరీక్షలు రాసేవారికి లబ్ధి కలిగించే పబ్లికేషన్స్‌ను మళ్లీ ప్రారంభించాలి. - ఆదిమూలపు సురేశ్, మంత్రి

భాషాభివృద్ధికి శాస్త్రీయ పదాలను తెలుగులోకి మార్చుకోవాల్సిన అవసరం ఉందని సురేశ్ అన్నారు. విభజన తరువాత రెండేళ్లలో తెలుగు అకాడమీని ఏపీలో ఏర్పాటు చేయలేకపోయారని చెప్పారు. అందుకే ఇప్పుడు రెండింటిని కలిపి తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటు చేశామన్నారు. ఈ అంశంపై ఇప్పుడు లేఖలు రాస్తున్న పార్టీలు, వ్యక్తులు తెదేపా హయాంలో ఏం చేశారని మంత్రి నిలదీశారు.

ఇదీ చదవండి:

Telugu Academy: ఇకపై తెలుగు-సంస్కృత అకాడమీ.. పేరు మార్చిన ప్రభుత్వం

Last Updated : Jul 14, 2021, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details