వచ్చే విద్యా సంతవత్సరం నుంచి విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. "నాడు-నేడు"లో భాగంగా పాఠశాలల ఆధునికీకరణ చేస్తున్నామన్నారు. విజయవాడలోని సింగ్ నగర్లో ఉన్న ఎంకే బేగ్ పాఠశాలలో నిర్మించిన అదనపు గదులను మంత్రి ప్రారంభించారు. కోటిన్నర రూపాయలతో తరగతి గదులు నిర్మించినట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్న మంత్రి.. తనని అందరూ అమ్మఒడి మంత్రి అంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
అందరూ నన్నలా అంటుంటే.. సంతోషంగా ఉంది: మంత్రి సురేశ్ - ఏపీ విద్యార్థులకు ల్యాప్టాప్లు
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్న మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. తనని అందరూ అమ్మఒడి మంత్రి అంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అందరూ నన్నలా అంటుంటే సంతోషంగా ఉంది