దళితుల పట్ల తెదేపా అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని ఆదిమూలపు సురేశ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలతో దళితుల గుండె గాయమైందన్నారు. విజయవాడలో 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై తెదేపా నేతలు నానా యాగీ చేస్తున్నారని.. ఇది దారుణమని మండిపడ్డారు. ఇదే విగ్రహం ముందు చంద్రబాబు క్షమాపణ చెప్పే రోజు వస్తుందన్నారు.
దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: మంత్రి సురేశ్ - దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
విజయవాడలో 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై తెదేపా నేతలు నానా యాగీ చేస్తున్నారని.. ఇది దారుణమని మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు. దళితుల పట్ల తెదేపా అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విజయవాడ నగరం నడిబొడ్డున 20 ఎకరాల విస్తీర్ణంలో 2 వేల కోట్ల విలువైన భూమిలో విగ్రహం ఏర్పాటు చేస్తూ రాజ్యాంగ నిర్మాతకు ఇస్తున్న గౌరవానికి నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. స్వరాజ్ మైదానాన్ని వాణిజ్య కేంద్రంగా మార్చి విలువైన స్థలాలను కొట్టేయాలని చూశారని తెదేపా నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు సీఎం జగన్ ఆ ప్రాంతంలోనే భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని స్పష్టం చేశారు.