AP NEWS:జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా నాణ్యమైన విద్యను అందించేలా ఏపీలో చర్యలు చేపట్టామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి యువత నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఇందిరాగాంధీ జాతీయసార్వత్రిక విశ్వవిద్యాలయం కోర్సుల ప్రారంభ కార్యక్రమానికి వర్చువల్ గా మంత్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్, ఇగ్నో వైస్ ఛాన్సలర్ తదితరులు హాజరయ్యారు.
AP NEWS: యువత నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ: మంత్రి ఆదిమూలపు సురేశ్ - ap eduction minister adimulapu suresh latest news
AP NEWS: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా ఏపీలో నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఇందిరాగాంధీ జాతీయ స్వార్వత్రిక విశ్వవిద్యాలయం కోర్సుల ప్రారంభ కార్యక్రమానికి వర్చవల్‌గా మంత్రి హాజరయ్యారు.
ఆదిమూలపు సురేశ్
విద్యాశాఖకు సంబంధించి ఏపీలో అమలు చేస్తున్న పథకాలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని మంత్రి పేర్కోన్నారు. నాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్లు సాధించి రెండు వందలకు పైగా సర్టిఫికెట్ కోర్సులు, డిప్లోమా, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ అందించటం ద్వారా ఇగ్నో జాతికి సేవలందిస్తోందని మంత్రి కొనియాడారు. జాతీయ నూతన విద్యావిధానం ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వచ్చే అవకాశముందన్నారు.
ఇదీ చదవండి: