వినియోగించిన విద్యుత్కే బిల్లులు వసూలు చేయనున్నట్లు మంత్రి సుచరిత తెలిపారు. పూర్తి పారదర్శంగా బిల్లుల వసూలు ఉంటుందని స్పష్టం చేశారు. వినియోగదారుల్లో అపోహలు తొలగించేందుకు విద్యుత్ శాఖ అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. బిల్లులో అనుమానాలుంటే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు. 500 దాటిన యూనిట్లపై స్వల్ప పెరుగుదల ఉందని.. ఇలాంటి వినియోగదారులు 5 శాతం మందే ఉన్నారని మంత్రి వివరించారు.
వినియోగించిన విద్యుత్కే బిల్లు వసూలు: మంత్రి సుచరిత - విద్యుత్ బిల్లుల పెంపుపై సుచరిత కామెంట్స్
విద్యుత్ ఛార్జీలు పెంచడమనేది అవాస్తవమని మంత్రి సుచరిత అన్నారు. ప్రజలు అనవసర ఆందోళనకు గురికావొద్దని తెలిపారు.
minister sucharitha on electric bills