ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రంలో 61 ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్ర మంత్రి అంగీకారం' - బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ న్యూస్

విజయవాడ కనకదుర్గ పైవంతెనను కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శంకరనారాయణ...రూ.15 వేల కోట్లకుపైగా విలువైన 61 ప్రాజెక్టులు చేపట్టేందుకు నితిన్ గడ్కరీ అంగీకరించారని తెలిపారు. కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజి సర్కిల్ ఫ్లైఓవర్​తో విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరాయని తెలిపారు.

Minister sankara narayana
Minister sankara narayana

By

Published : Oct 16, 2020, 7:09 PM IST

రాష్ట్రంలో రూ.15 వేల కోట్లకుపైగా విలువైన 61 ప్రాజెక్టులు చేపట్టేందుకు కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ తెలిపారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు, బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభించడం సంతోషకరమన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన నిధులను విడుదల చేయించి.. కనకదుర్గ పైవంతెన నిర్మాణం పూర్తి చేయించినట్లు తెలిపారు.

కనకదుర్గ పైవంతెనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో మంత్రి శంకర నారాయణ, కృష్ణా జిల్లా ఇన్​ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్లైఓవర్ ప్రారంభించడంపై స్థానికులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు ఫ్లైఓవర్ కావాలన్న తమ చిరకాల కల నెరవేరిందని తెలిపారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details