పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా.. జులై 1, 3, 4 తేదీల్లో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనల కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు వెల్లడించారు. 28 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఇరుకైన ఇళ్లు నిర్మిస్తున్నారంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరికావని మంత్రి వ్యాఖ్యానించారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం 300 అడుగుల్లో నిర్మాణం చేపడితే సరిపోతుందని, కానీ 340 అడుగుల విస్తీర్ణంలో ఏపీ సర్కార్ ఇళ్లను నిర్మిస్తోందని స్పష్టం చేశారు.
JAGANANNA HOUSE: 'ఇరుకైన ఇళ్లు నిర్మిస్తున్నారన్న వ్యాఖ్యలు అవాస్తవం' - Minister ranganatharaju talks about houses construction
జులై 1, 3, 4 తేదీల్లో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపనల కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టనున్నట్లు మంత్రి రంగనాథరాజు (Minister ranganatharaju)వెల్లడించారు. ఇరుకైన ఇళ్లు నిర్మిస్తున్నారన్న వ్యాఖ్యలు సరికావని, 340 అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోందని తెలిపారు.
మంత్రి రంగనాథరాజు