సీఎం జగన్ రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రూ.1.25 లక్షల కోట్ల నిధులను ప్రజలకు అందించారని మంత్రి పేర్ని నాని తెలిపారు. లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా నిధులను జమ చేస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 129 వాగ్దానాల్లో 107 వాగ్దానాలను పూర్తిగా అమలు చేశామని, మిగిలిన హామీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మంచి చేస్తున్నారన్న అక్కసుతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు విమర్శలకు పాల్పడుతున్నారని మంత్రి నాని ఆరోపించారు.
రెండేళ్ల వైకాపా పాలనలో సంక్షేమానికి పెద్దపీట: పేర్ని నాని - clarification on welfare schemes
రెండేళ్ల వైకాపా పాలనలో రూ.1.25లక్షల కోట్లను వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

మంత్రి పేర్ని నాని
ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకున్నారని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ క్రమంలో ఈ నెల 30న 16 వైద్య కళాశాలలను సీఎం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దళితుడిపై హత్యాయత్నం చేసిన బీసీ జనార్దన్‌రెడ్డిని చంద్రబాబు వెనకేసుకు రావడం ఏమిటని ప్రశ్నించారు.
ఇదీచదవండి.