పెట్రోలు, డీజిల్పై కేంద్రం 10 రూపాయలు పెంచితే అది ఎవరికీ కనపడలేదని.. రాష్ట్రంలో రూపాయి పన్ను పెంచితే కొందరు బాధపడుతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటివరకు కేంద్రం పెట్రోలు, డీజిల్పై రూ. 10 పెంచిందన్నారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణం కోసమే ఈ పన్ను వసూలు చేశామని మంత్రి స్పష్టం చేశారు.
కేంద్రం రూ.10 పెంచితే ఎవరికీ కనపడలేదు: పేర్ని నాని - మంత్రి పేర్ని నాని
రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసమే పెట్రోలు, డీజిల్పై పన్ను పెంచామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. కేంద్రం రూ.10 పెంచితే లేని బాధ, తాము రూపాయి పెంచితే కొందరు బాధపడుతున్నారని విమర్శించారు.
పేర్ని నాని, మంత్రి