ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు ఎన్ని చెప్పులతో కొట్టుకున్నారు' - పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం

Minister Perni Nani on Kottapalli Subbarao: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఎంపిక విషయంలో వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తీరుపై మంత్రి పేర్నినాని మండిపడ్డారు. అభ్యంతరాలు ఉంటే ముఖ్యమంత్రికో లేదా ప్రభుత్వానికి తెలియచేయాలన్నారు.

Minister Perni Nani on Kottapalli Subbarao
మంత్రి పేర్నినాని

By

Published : Mar 22, 2022, 5:19 PM IST

'పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు ఎన్ని చెప్పులతో కొట్టుకున్నారు'

Minister Perni Nani News: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఎంపిక విషయంలో వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు లేనిపోని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఎంపిక విషయంలో అభ్యంతరాలుంటే ముఖ్యమంత్రికో లేక ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజును గెలిపించుకున్నందుకు చెప్పుతో కొట్టుకుని నిరసన తెలపడాన్నిపేర్ని నాని తప్పుపట్టారు. ఆయన చెప్పుతో ఆయన్ను కొట్టుకుంటే వివాదం పరిష్కారమవుతుందా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే ప్రసాదరాజును రాజకీయంగా పతనం చేయడానికే కొత్తపల్లి ఈ ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు ఎన్ని చెప్పులతో కొట్టుకున్నారని నిలదీశారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details