Minister Perni Nani on New Districts జిల్లా కేంద్రాలు, పునర్వవస్థీకరణపై అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని ప్రజలను కోరుతున్నట్టు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు. గతంలో జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో లేనంత దూరంలో ఉండేవని మంత్రి అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేపట్టామని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ చేసేవారు.. కలెక్టర్కు అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియచేయాలని మంత్రి సూచించారు. మెజారిటీ ప్రజల ఆమోదాన్నే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు.
Perni Nani on New Districts: రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేసేవారు అభ్యంతరాలు తెలపండి..: మంత్రి పేర్ని నాని - perni nani clarify on districts
Minister Perni Nani on District Divisions: పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన చేశామని మంత్రి పేర్నినాని అన్నారు. జిల్లా కేంద్రాలు, పునర్వవస్థీకరణపై అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే డిమాండ్ చేసేవారు.. కలెక్టర్కు అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియచేయాలని మంత్రి సూచించారు.

మంత్రి పేర్ని నాని
పీఆర్సీపై ఉద్యోగ సంఘాలను చర్చలకు రావాలని పదేపదే కోరుతున్నామని మంత్రి చెప్పారు. ప్రభుత్వంతో చర్చిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని.. మంత్రుల కమిటీ సభ్యుడిగా కోరుతున్నానని నాని వ్యాఖ్యానించారు. చర్చలకు వచ్చి.. ఆర్థికశాఖ చేసింది తప్పని రుజువు చేస్తే సీఎంను ఒప్పించేందుకు కమిటీ ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: