రాష్ట్రంలో నాటక కంపెనీలు లేని లోటు తెదేపా తీర్చిందని మంత్రి పేర్ని నాని విమర్శించారు. తెదేపా నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఓ డ్రామా అని అన్నారు. మాక్ అసెంబ్లీలో మహానటులంతా కనిపించారని విమర్శించారు. బడ్జెట్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు అర్థరహితమని పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌కు ప్రవృత్తి రాజకీయాలని, వృత్తి నటన అని ఎద్దేవా చేశారు.
తెదేపా మాక్ అసెంబ్లీ నాటకాలను తలపించాయి: పేర్ని నాని - టీడీపీ మాక్ అసెంబ్లీ వార్తలు
శాసనసభ సమావేశాలను తెలుగు దేశం పార్టీ బహిష్కరించడం, మాక్ అసెంబ్లీ నిర్వహించడంపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తెదేపా చేసిన మాక్ అసెంబ్లీ సురభి కంపెనీ లాంటి నాటకాలను తలపించాయని అన్నారు.

తెదేపా మాక్ అసెంబ్లీ నాటకాలను తలపించాయి: పేర్ని నాని