ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

60 ఏళ్లు దాటిన వాళ్లకు ఆర్టీసీలో 25 శాతం రాయితీ: మంత్రి పేర్నినాని

Minister Perni Nani on RTC: సీనియర్​ సిటిజన్లకు ఆర్టీసీలో 25 శాతం రాయితీని ఏప్రిల్​ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో మాదిరే ఆర్టీసీలోనూ కారుణ్య నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Minister Perni nani comments on compassionate jobs
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు

By

Published : Mar 16, 2022, 4:43 PM IST

త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపడుతామని మంత్రి పేర్ని నాని అన్నారు. 1,800 మందికి కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు మిగిలిన శాఖల్లో భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు కారుణ్య నియామకాల భర్తీకి చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. అలాగే.. సీనియర్​ సిటీజన్లకు ఆర్టీసీలో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

చమురు కంపెనీల నుంచి కొనే డీజిల్ ధరలో మార్పులు వచ్చాయి. అయితే బయట బంకుల్లో డీజిల్‌ కొనుగోలుతో రోజుకు రూ.కోటిన్నర ఆదా అవుతుంది. తిరుపతి నుంచి తిరుమల, మదనపల్లె, నెల్లూరుకు తొలుత ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతాం. ఆర్టీసీలో వృద్ధులకు 25 శాతం రాయితీ ఏప్రిల్ నుంచి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాం. -పేర్ని నాని, రాష్ట్ర మంత్రి

60 ఏళ్లు దాటిన వాళ్లకు ఆర్టీసీలో 25 శాతం రాయితీ: మంత్రి పేర్నినాని

ఇదీ చదవండి:ముఖ్యమంత్రి జగన్​కు సోము వీర్రాజు బహిరంగ లేఖ.. అందులో ఏముందంటే?

ABOUT THE AUTHOR

...view details