నెలరోజుల్లోనే.. నమ్మకం పెంచేలా పాలన: పేర్ని నాని - పేర్ని నాని
నవరత్నాలు అమలే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. మాట ఇస్తే తప్పరనే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.
ఐదేళ్లలో అవినీతి, అక్రమాలకు చిరునామాగా తెదేపా పాలన సాగిందని, వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ నూతన ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశం అమలయ్యేలా, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 30 రోజుల పాలన అద్భుతంగా ఉందని వివరించారు. జూన్ 13 నాటికి రాష్ట్రంలో 10 వేలకు పైగా ఫిట్నెస్ లేని పాఠశాలల బస్సులు ఉండేవని.. రవాణాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా 6వేల బస్సులు ఫిట్ నెస్ పత్రాలు పొందాయన్నారు.