Peddireddy Ramachandra reddy: రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటానని.. రాష్ట్ర విద్యుత్తు, గనుల, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గనులశాఖలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఆదాయం పెరిగిందని, దాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. సచివాలయంలోని మూడో బ్లాక్‌లోని ఛాంబర్‌లో ఆయన మంత్రిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
ఉచిత విద్యుత్తు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని మంత్రి అన్నారు. అటవీ అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే నిధులను సకాలంలో వినియోగించుకోవడంపై దృష్టి సారించాలని అటవీ అధికారులతో సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు.