జగనన్న పచ్చతోరణం పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది 60 లక్షల మొక్కలు నాటాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో తీసుకుంటున్న సంరక్షణా చర్యల కారణంగా ఈ ఏడాదిలో నాటిన మొక్కలు 94 శాతం మేర పెరుగుతున్నాయన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో జగనన్న పచ్చతోరణం, వైఎస్ఆర్ జలకళ, గ్రామీణాభివృద్ధి పథకాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
వచ్చే ఏడాది 60 లక్షల మెుక్కలు నాటాలి: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - Minister peddireddy Ramachandra Reddy latest updates
జగనన్న పచ్చతోరణం పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది 60 లక్షల మొక్కలు నాటాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో తీసుకుంటున్న సంరక్షణా చర్యల కారణంగా ఈ ఏడాదిలో నాటిన మొక్కలు 94 శాతం మేర పెరుగుతున్నాయన్నారు.
మరోవైపు ఉపాధి హామీ పథకం పనుల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించి పనులు కల్పించాల్సి ఉందని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. నరేగా పనుల్లో బిల్లులు జాప్యం లేకుండా చెల్లింపులు చేయాలన్నారు. వైఎస్‌ఆర్ జలకళ కింద రైతుల నుంచి 1,94,120 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో అర్హత ఉన్న 1,32,911 దరఖాస్తులకు అనుమతి ఇచ్చామన్నారు. 36,912 దరఖాస్తులకు భూగర్భజల సర్వే పూర్తయ్యిందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:గంజాయి పంట ధ్వంసం చేసేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనుల దాడి