ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబు పాలన.. మా పాలనలో తేడా కోసమే ఇసుకపై నియంత్రణ' - చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు న్యూస్

చంద్రబాబు ఇసుకపైనే రాజకీయాలు కొనసాగించాలని చూస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఇసుక కొరత సమస్య తీరేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

మంత్రి పెద్దిరెడ్డి

By

Published : Nov 12, 2019, 7:45 PM IST

'చంద్రబాబు పాలనకు.. మా పాలనకు తేడా కనపడలేకదా'

ఇసుకపై విపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకే.. చంద్రబాబు సొంత పుత్రుడు లోకేశ్.. దత్త పుత్రుడు పవన్​చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో పోటీ పడి ఇసుకపై దోచుకున్నారని ఆరోపించారు. ఎవరైనా.. ఇసుక దొంగతనం చేసినా..స్మగ్లింగ్ చేసినా.. రూ.2 లక్షల జరిమానాతోపాటు.. జైలుకు పంపేలా చట్టం తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎర్రచందనం మాదిరి ఇసుకపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని.. ఓ విలేకరి అడిగిన.. ప్రశ్నకు.. చంద్రబాబు పాలనకు మా పాలనకు తేడా కనపించాలి కదా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానమిచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details