ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థానిక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు: మంత్రి పెద్దిరెడ్డి

స్థానిక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, జడ్పీల్లో ఇద్దరు వైస్ ఛైర్మన్లను నియమించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. న్యాయ పరమైన అవరోధాలు తొలిగిపోయాయి కాబట్టి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వెంటనే పూర్తి చేయాలని ఎస్ఈసీని కోరారు.

స్థానిక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు
స్థానిక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు

By

Published : Mar 16, 2021, 6:24 PM IST

స్థానిక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. జడ్పీల్లో ఇద్దరు వైస్ ఛైర్మన్లను నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు ఆర్డినెన్స్​ రూపొందించి గవర్నర్ ఆమోదం కోసం పంపించామన్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు వెంటనే ఎన్నికలు జరపాలి

న్యాయపరమైన అవరోధాలు తొలిగిపోయాయి కాబట్టి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వెంటనే పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి ఎస్ఈసీని కోరారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు 6 రోజుల సమయం సరిపోతుందన్నారు. ఈ ఎన్నికలను కూడా పూర్తి చేసి నిమ్మగడ్డ పదవీ విరమణ చేయాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉందన్నారు. దేశమంతా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ జరుగుతుంటే... రాష్ట్రంలో ఎన్నికల వల్ల ఆలస్యమవుతుందన్నారు. పరిషత్ ఎన్నికలు నిర్వహించిన తర్వాత మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా..వైకాపాను దెబ్బతీయాలన్న ఆలోచనతో ప్రక్రియను తోసిపుచ్చి ఇష్టానుసారంగా ఎన్నికలు నిర్వహించారని మంత్రి ఆరోపించారు.

ఇదీచదవండి

పరిషత్‌ ఎన్నికలపై... ఎస్‌ఈసీ ఆదేశాలు రద్దు చేసిన హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details