ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్​ఈసీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన మంత్రి పెద్దిరెడ్డి ​ - ఎస్​ఈసీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన మంత్రి పెద్దిరెడ్డి ​

తన నివాసం నుంచి బయటకురాకుండా కట్టడి చేయాలని ఎస్​ఈసీ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమంటూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలుచేశారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని మంత్రి తరపు న్యాయవాది కోరగా..ఇవాళ విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది.

ఎస్​ఈసీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన మంత్రి పెద్దిరెడ్డి  ​
ఎస్​ఈసీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన మంత్రి పెద్దిరెడ్డి ​

By

Published : Feb 7, 2021, 4:58 AM IST

తన నివాసం నుంచి బయటకురాకుండా కట్టడి చేయాలని ఎస్​ఈసీ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమంటూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు శనివారమే ఆయన హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలుచేశారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని మంత్రి తరపు న్యాయవాది కోరగా..ఇవాళ విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది.

ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలతో..రాష్ట్రపతి చిత్తూరు పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొనే అంశంపై సందిగ్ధత నెలకొంది. తాను జారీచేసిన నిషేధాజ్ఞలను...కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర ఎన్నికల కమిషన్..రాష్ట్రపతి ఆహ్వానితుల జాబితాలో పెద్దిరెడ్డి ఉన్నందున తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

మరోవైపు పరిమిత కాలంపాటు అధికారం కల్గి ఉన్న ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్..ఏపీ ప్రభుత్వంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని..ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎస్​ఈసీ వైఖరి చూస్తుంటే... పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తారనే అనుమానం వస్తోందన్న సజ్జల..వాటిని సైతం స్వాగతిస్తామని పేర్కొన్నారు.

ఇదీచదవండి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details