Minister Peddireddy On CBN : చంద్రబాబు తెలంగాణలో కూర్చుని ఏపీ పాలనపై బురద జల్లుతున్నారని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. విమర్శలు చేసే ముందు ప్రజల మనోభావాన్ని ఆయన తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు. చంద్రబాబు, తెదేపాకి మాత్రమే సైకో పాలనలా కనిపిస్తోందని వ్యాఖ్యానించిన మంత్రి.. 2024 లోనూ వైకాపాకు విజయం అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. జిల్లాల ఏర్పాటుపై మాట్లాడుతూ.. క్షేత్రస్థాయికి పాలనను తీసుకువెళ్లేలా సచివాలయ వ్యవస్థను రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఉగాది తర్వాత కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని.. విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతాల వల్ల పాలనలో ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా అధికారులకు పాలనపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందన్నారు.
చంద్రబాబుకు మాత్రమే సైకో పాలనలా కనిపిస్తోంది : మంత్రి పెద్దిరెడ్డి - Minister Peddireddy On CBN
Minister Peddireddy On CBN : చంద్రబాబు తెలంగాణాలో కూర్చుని ఏపీ పాలనపై బురద జల్లుతున్నారని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. విమర్శలు చేసే ముందు ప్రజల మనోభావాన్ని ఆయన తెలుసుకోవాలని మంత్రి హితవు పలికారు.
Minister Peddireddy