Minister Peddireddy: రాష్ట్రంలో 92 శాతం గ్రామాలకు పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇప్పటివరకు 50.26 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. 2024లోపు 100 శాతం కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల కనెక్షన్లు ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. 56,448 పనుల కోసం రూ.18,932 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.
ఆ రాష్ట్రాలకు ఇచ్చినట్టే.. ఏపీకీ నిధులివ్వండి: మంత్రి పెద్దిరెడ్డి - విజయవాడ లేటెస్ట్ అప్డేట్
Minister Peddireddy: ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నట్టుగానే.. ఆంధ్రప్రదేశ్‌కూ నిధులు ఇవ్వాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.
మంత్రి పెద్దిరెడ్డి
Minister Peddireddy: మరోవైపు రాష్ట్ర వాటా కింద 50 శాతం నిధులు ఇచ్చేందుకు సిద్ధమేనని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులు ఇస్తోందని, ఏపీకి కూడా అంతే నిష్పత్తిలో నిధులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు విజయవాడలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇదీ చదవండి:Botsa: ముమ్మాటికీ వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం: మంత్రి బొత్స