రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు నిబంధనలకు వ్యతిరేకంగా భూగర్భ జలాలు వినియోగిస్తున్నాయని..,ఈ అంశంపై దృష్టి పెట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సచివాలయంలో వాల్టా చట్టంపై మంత్రి పెద్దిరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ (సీఇడబ్ల్యూఏ) నిబంధనల అమలుపై మంత్రి ఆరా తీశారు. ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను వినియోగించే పరిశ్రమలపై కేసులు నమోదు చేయాలని సూచించారు.
పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై ఛార్జీల విధింపు అంశాన్ని పరిశీలించాలన్నారు. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఛార్జీల ఖరారులో పరిశ్రమలపై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.