ఆర్ఎస్ఎస్ ఏపీ కార్యాలయం హైందవి నిలయంలో.. స్వయం సేవక్ సంఘ్ ముఖ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమావేశం కానున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన విజయవాడ చేరుకున్నారు. భాజపా నేతలతో కలిసి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. గన్నవరం విమానాశ్రయం వద్ద కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
హైందవి నిలయానికి వెళ్లనున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి - ap bjp office inaugaration
ఏపీలోని స్వయం సేవక్ సంఘ్ ముఖ్యులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కలవనున్నారు. ఆయన ఇప్పటికే విజయవాడ చేరుకోగా.. ఈరోజు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ పర్యటన