ముఖ్యమంత్రి జగన్ పాలనలోనే దళితులకు రాజకీయంగా, ఆర్థికంగా నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. జగన్ తనకు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి ఓ చరిత్ర సృష్టించారన్నారు. వాణిజ్య పన్నుల శాఖను తన నుంచి తొలగించి ఎక్సైజ్ శాఖకే పరిమితం చేయటంపై కొందరు తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన చర్మంతో జగన్‌కి చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేననని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దళితులను వ్యక్తిగతంగా అభివృద్ది చేస్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనను దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుందని చెప్పారు. వచ్చే ఏడాది నిరుపేదలైన దళితులకు భూ పంపిణీ చేయమని సీఎం జగన్‌కు చెప్పానని..ఆయన సానుకులంగా స్పందించారన్నారు.