'రాజకీయాల కోసమే తెలంగాణ నేతలు రెచ్చగొడుతున్నారు' కృష్ణా నది నుంచి గ్లాసు నీరు కూడా అదనంగా తీసుకోవట్లేదని మంత్రి పేర్ని నాని(Perni Nani) స్పష్టం చేశారు. జలాల వినియోగంపై ఎవరి సందేహాలు తీర్చేందుకైనా ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. రాజకీయాల కోసమే తెలంగాణ నేతలు రెచ్చగొడుతున్నారన్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదని నాని స్పష్టం చేశారు. కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతే సీఎం జగన్ విధానమన్నారు.
ఎన్జీటీ ఆగ్రహం
ఇదిలా ఉండగా..రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంలో ఏపీ తీరుపై ఎన్జీటీ (ngt) ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్జీటీ హెచ్చరించింది. పర్యావరణ అనుమతుల్లేకుండా పనులు చేయవద్దని.. ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోదంటూ..తెలంగాణకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
ఇదీచదవండి
NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంలో ఏపీ తీరుపై ఎన్జీటీ ఆగ్రహం