ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'క్రాప్‌ బుకింగ్‌ చేసుకోని వారితోనే ఇబ్బందులు'

''రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. వారిని ఆదుకునేందుకే రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. సుబాబుల్, టమాట రైతులను ఆదుకున్నాం.'' మోపిదేవి వెంకటరమణ

మంత్రి మోపిదేవి మీడియా సమావేశం

By

Published : Oct 21, 2019, 8:15 PM IST

Updated : Oct 23, 2019, 11:52 AM IST

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఎప్పుడైనా గిట్టుబాటు ధర రాకుంటే ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిందన్నారు. 35 వేల మంది శనగ రైతులకు 70 కోట్ల మేర పరిహారం చెల్లించామనీ.. 7 జిల్లాల్లో 330 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
క్రాప్ బుకింగ్ చేసుకున్న వారికి ఆర్ధిక సాయం వస్తుందనీ.. శనగ రైతులు అలా చేసుకోకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇ-క్రాప్ నిబంధనలు సడలించి వారినైనా ఆదుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఉల్లి ధరలు తగ్గించేందుకు మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి 700 మెట్రిక్ టన్నులు కోనుగోలు చేసి... కిలో 25 రూపాయలకే అందిస్తున్నామని వివరించారు. టమాట రైతులనూ ఆదుకుంటామన్నారు. సుబాబుల్ రైతులకు 5 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు.

మంత్రి మోపిదేవి మీడియా సమావేశం
Last Updated : Oct 23, 2019, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details