ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ధైర్యం నింపాల్సింది పోయి.. రాజకీయాలు చేస్తారా?' - minister mopidevi venkat ramana

కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని... పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కోరారు.

minister mopidevi comments
మంత్రి మోపిదేవి వెంకటరమణ

By

Published : Apr 26, 2020, 7:51 PM IST

మంత్రి మోపిదేవి వెంకటరమణ

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని...ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు ఆత్మస్థైర్యంతో ఉండి.. ప్రభుత్వ నియమాలను పాటించాలని మంత్రి మోపిదేవి వెంకటరమణ పిలుపునిచ్చారు. కరోనా నిర్మూలనకు సీఎం జగన్‌ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో, కరోనాపై పోరులో సేవలందిస్తున్న అధికారుల్లో ధైర్యాన్ని నింపాల్సింది పోయి... ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి ఆగ్రహించారు.

ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నా... సంక్షేమ పథకాలు ఆపకుండా... పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ సీఎం నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. గుజరాత్‌లో చిక్కుకున్న మత్స్యకారులను స్వస్థలాలకు చేరుస్తామని స్పష్టం చేశారు. వారి కుటుంబాలకు 4 వేల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details