రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సహా కేబుల్ టీవీ సదుపాయాల కల్పనే లక్ష్యంగా... మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఫైబర్ నెట్ కు మంచి డిమాండ్ వస్తోందని... రానున్న 2-3 ఏళ్ల కాలంలో 60 లక్షల మంది చందాదారులకు ఫైబర్ నెట్ సేవలు విస్తరిస్తామని తెలిపారు. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా చందాదారులు ఉన్నారని.. నిర్దేశించుకున్న గ్రామపంచాయతీలు, మండలాల్లో పక్కాగా ఫైబర్ నెట్వర్క్ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేలా చూడడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త పరికరాల సేకరణ, అంచనా, ఆర్థిక భారం తగ్గించేందుకు 'టెక్నికల్ కమిటీ'ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేలా అన్ి చర్యలు తీసుకోవాలన్నారు.