ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'లేపాక్షి' కి త్వరలో బ్రాండ్ అంబాసిడర్: మంత్రి గౌతమ్​ రెడ్డి - ఏపీలో చేతనే హస్తకళ తాజా వార్తలు

లేపాక్షి హస్త కళాకృతులు సహా ఆప్కో వస్రాల అమ్మకాలు పెంచేందుకు బ్రాండ్ అంబాసిడర్​ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు.

Minister Mekapati Goutham Reddy review on handloom textiles
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

By

Published : Sep 16, 2021, 6:10 AM IST

లేపాక్షి హస్తకళారూపాలు, చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండింగ్ రూపొందించాలని ఆధికారులను మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆదేశించారు. అవసరమైతే బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకోవాలని సూచించారు. చేనేత, జౌళి శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అత్యుత్తమ హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఫోటోలతో నివేదిక అందించాలని నిర్దేశించారు. పవర్ లూమ్ యూనిట్ల విద్యుత్ టారిఫ్ వివరాలు, ముద్ర రుణాలు అందుతున్న తీరును ఆరా తీశారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా హస్తకళల ఉత్పత్తులు, చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాంటి ఆర్డర్లను 3 రోజుల్లో డెలివరీ చేసేలా చూడాలన్నారు. తోలు బొమ్మలు, ఆదివాసీ పెయింటింగ్స్, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, బంజారా ఎంబ్రాయిడరీ వస్తువల తయారీలో మరింత శిక్షణ అందిస్తే నాణ్యత పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 'ఒక జిల్లా - ఒక వస్తువు'పై మరింత దృష్టి పెట్టాలన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details