కరోనా విపత్తు విజృంభిస్తున్నా రీస్టార్ట్ ప్యాకేజీతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సాయం అందించామని మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండియన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అసోసియేషన్, ఏపీ ఈడీబీ సంయుక్తంగా నిర్వహించిన వెబినార్‌లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రసంగించారు. వృద్ధికి అవకాశాలున్న రంగాలను అంచనా వేసి పెట్టుబడుల ఆకర్షణకు నిరంతరం కృషి చేస్తున్నట్టు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ పారిశ్రామిక ప్రగతికి కీలకమైన విద్య, నైపుణ్యాలకూ పెద్దపీట వేస్తున్నట్టు స్పష్టం చేశారు. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ మరింత స్ఫూర్తిగా నిలబడతామని అన్నారు.
పారిశ్రామిక ప్రగతికి పెద్దపీట వేస్తున్నాం: మంత్రి గౌతమ్ రెడ్డి - ఏపీ పరిశ్రమలు తాజా వార్తలు
కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. లాక్డౌన్ అనంతరం అన్ని జాగ్రత్తలతో పరిశ్రమలను పున:ప్రారంభించామని పేర్కొన్నారు.
minister mekapati gautham reddy on industries