విశాఖ-చెన్నై కారిడార్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటాను 20 నుంచి 10 శాతానికి తగ్గించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది. రెండు రోజుల దిల్లీ పర్యటనలో భాగంగా.. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్(Commerce and Industry Piyush Goel)తో భేటీ అయిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి(Minister Mekapati Gautam Reddy)... ఈ మేరకు ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.
విద్యుత్ ఉపకరణాల జోన్‌గా.. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి: గౌతమ్ రెడ్డి - Minister Mekapati Gautam Reddy latest news
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్(Commerce and Industry Piyush Goel)తో రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(minister Mekapati Gautam Reddy)భేటీ అయ్యారు. విశాఖ-చెన్నై కారిడార్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటను 20 నుంచి 10 శాతానికి తగ్గించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. భారీ విద్యుత్ ఉపకరణాల జోన్‌గా మన్నవరాన్ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని కోరినట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు
గౌతమ్ రెడ్డి
రాష్ట్రంలో భారీ విద్యుత్ ఉపకరణాల జోన్‌గా మన్నవరాన్ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని కోరినట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. కడప జిల్లా కొప్పర్తిలో టెక్స్‌టైల్ ఏర్పాటు ప్రతిపాదననూ ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. నేడు ఓడరేవులు, విద్యుత్ శాఖల మంత్రులు, ప్రపంచ ఆర్థిక సమాఖ్య అధ్యక్షుడితో గౌతమ్‌రెడ్డి భేటీ కానున్నారు.
ఇదీ చదవండి