ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తాం: కేటీఆర్ - Telangana bavan news

న్యాయవాద దంపతుల హత్యోదంతంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మర్డర్ కేసులో నిందితులెవరున్నా కఠినంగా శిక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో తెరాస లీగల్ సెల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అతిత్వరలో న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తాం: కేటీఆర్
అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తాం: కేటీఆర్

By

Published : Mar 2, 2021, 11:41 PM IST

లాయర్‌ వామన్‌రావు దంపతుల హత్యకేసులో నిందితులెవరున్నా... కఠినంగా శిక్షించేలా సీఎం ఆదేశించారని తెలంగాాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. స్వరాష్ట్రం వచ్చిన నాటి నుంచి తెరాస ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో ఉక్కుపాదం మోపుతూనే ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. దేశంలోనే తొలిసారిగా అతిత్వరలో న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణభవన్‌లో న్యాయవాదులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ వచ్చిన తర్వాత పేదవారి ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, న్యాయవాదులు హాజరయ్యారు.

తెలంగాణ వ్యక్తిని ఏజీ చేయాలని గతంలో పలుమార్లు కోరాం. వైఎస్‌ఆర్‌ హయాంలో కోరితే నమ్మకమైన వ్యక్తి కావాలన్నారు. జైపాల్‌రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ వ్యక్తిని ఏజీ చేయాలని కోరాం. రామకృష్ణారెడ్డిని ఏజీగా నియమించాలని కోరాం. ఎందరిని కోరినా తెలంగాణ వ్యక్తిని ఏజీ చేయలేదు. తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపు రావట్లేదని పలుమార్లు తేటతెల్లమైంది. తెలంగాణ వచ్చాక రామకృష్ణారెడ్డిని ఏజీగా నియమించారు.

--- కేటీఆర్, తెరాస కార్యానిర్వాహక అధ్యక్షుడు

తెరాస జెండా లేకపోతే... ప్రత్యేక రాష్ట్రం సిద్దించేదే కాదని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని దూషించడం మంచిదికాదని హితవు పలికారు. మంథని న్యాయవాదుల దారుణ హత్యపై స్పందించిన ఆయన... తమ పార్టీకి చెందిన వారి పాత్ర ఉన్నట్లు గుర్తించి వారిని పార్టీలోనుంచి తీసివేసినట్లు స్పష్టం చేశారు. వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్

ABOUT THE AUTHOR

...view details