ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉమా... లారీ డ్రైవర్ అంటున్నావ్.. ! వాళ్లకు కోపం వస్తే ఏమవుతుందో.. చూసుకో..! - kodali nani comments on devineni uma

మంత్రి కొడాలి నాని .. తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పదే పదే లారీ డ్రైవర్​ అనడంపై విరుచుకుపడ్డారు. లారీ డ్రైవర్లకు కోపం వస్తే... ఏమవుతావో చూసుకో అంటూ హెచ్చరించారు.

kodali nani comments on devineni uma
మంత్రి కొడాలి నాని

By

Published : Sep 4, 2020, 2:15 PM IST

Updated : Sep 4, 2020, 4:45 PM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై... మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. తనను లారీ డ్రైవర్​ అనే దేవినేని ఉమ చరిత్ర అందరికీ తెలుసన్నారు. లారీ డ్రైవర్, క్లీనర్ అంటూ తనను కించపరిచేలా మాట్లాడుతున్నారని.. వాళ్లకు కోపం వస్తే.. ఆయన్ను ఏమైనా చేయొచ్చని అన్నారు. తన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేకపోతే ఇక చెప్పబోమని... తామేంటో చేసి చూపిస్తామని నాని హెచ్చరించారు.

Last Updated : Sep 4, 2020, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details