వాహన మిత్ర పథకం ద్వారా రెండేళ్ల కాలంలో రూ.510 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. 2020-21 సంవత్సరానికి సంబంధించిన నగదు బదిలీ కార్యక్రమాన్ని విజయవాడ ఆర్టీసీ సమావేశ మందిరంలో రవాణాశాఖ కార్యదర్శి కృష్ణబాబుతో కలిసి ప్రారంభించారు. సొంత ఆటో, క్యాబ్ కలిగిన డ్రైవర్లకు పథకం ద్వారా రూ. 10 వేలు జమ చేసినట్లు తెలిపారు. అర్హులెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
'వాహన మిత్ర పథకం ద్వారా రెండేళ్లలో రూ.510 కోట్లు జమ' - వాహనమిత్ర కార్యక్రమం
2020-21 సంవత్సరానికి సంబంధించిన వాహనమిత్ర పథకం నగదు బదిలీ కార్యక్రమాన్ని విజయవాడ ఆర్టీసీ సమావేశ మందిరంలో మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రెండేళ్ల కాలంలో రూ.510 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు.
'వాహన మిత్ర పథకం ద్వారా రెండేళ్లలో రూ.510 కోట్లు జమ చేశాం'