విశాఖపట్నం, తిరుపతితోపాటు బెంగళూరుకు సమీపంలో ఉన్న మన రాష్ట్రంలోని మరో ప్రాంతంలో మూడు ఐటీ కాన్సెప్ట్ నగరాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ రహదారులు, విమానాశ్రయాలకు దగ్గరగా ప్రపంచస్థాయి మౌలిక వసతులతో వాటిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఏర్పాటుచేసిన సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలను వాటికి అనుసంధానించనున్నట్లు వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒంటరి మహిళ, పురుషులకు బియ్యం కార్డులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఒకే సభ్యుడు ఉండే కార్డుదారులకు బయోమెట్రిక్‌లో వారి వేలిముద్ర పడకపోతే వాలంటీరు వేలిముద్రతో బియ్యం ఇస్తామని ప్రకటనలో తెలిపారు.
it concept cities: రాష్ట్రంలో మూడు ఐటీ కాన్సెప్ట్ నగరాలు - రాష్ట్రంలో మూడు ఐటీ కాన్సెప్ట్ నగరాలు
రాష్ట్రంలో మూడు ఐటీ కాన్సెప్ట్ నగరాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ దృష్టిసారించారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులతో వాటిని నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
![it concept cities: రాష్ట్రంలో మూడు ఐటీ కాన్సెప్ట్ నగరాలు minister kodali nani on three it concept cities](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13087537-150-13087537-1631844041417.jpg)
శాఖ మంత్రి కొడాలి నాని