ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిషత్ ఎన్నికల వాయిదాపై హౌస్​ మోషన్ పిటిషన్ వేస్తాం: కొడాలి నాని - హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై కొడాలి నాని కామెంట్స్

పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తూ.. హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై బుధవారం హౌస్​ మోషన్​ పిటిషన్​ వేయనున్నట్లు మంత్రి కొడాలి నాని చెప్పారు. ఓడిపోతామనే భయంతోనే ప్రతిపక్షాలు.. ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.

పరిషత్ ఎన్నికల వాయిదాపై హౌస్​ మోషన్ పిటిషన్ వేస్తాం: కొడాలి నాని
పరిషత్ ఎన్నికల వాయిదాపై హౌస్​ మోషన్ పిటిషన్ వేస్తాం: కొడాలి నాని

By

Published : Apr 6, 2021, 6:21 PM IST

పరిషత్ ఎన్నికల వాయిదాపై హౌస్​ మోషన్ పిటిషన్ వేస్తాం: కొడాలి నాని

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిలుపుదలపై హౌస్​ మోషన్ పిటిషన్​ వేస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు. అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యకలాపాలకు కోడ్ అడ్డు కాకూడదని త్వరితగతిన ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఎన్నికలకు భయపడి పారిపోయిన తెదేపా, ఓడిపోతామని తెలిసి నామమాత్ర స్థానాలకు పోటీ చేస్తున్న భాజపా, జనసేనలు రాష్ట్రంలో పోలింగ్ జరుగకుండా అడ్డుకుంటున్నాయని కొడాలి నాని ఆరోపించారు. హౌస్ మోషన్ పిటిషన్​లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details