రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సీఎం జగన్ వెనక్కి చూసే ప్రసక్తే లేదని పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఉడత ఊపులు, బెదిరింపులకు భయపడి ఆయన వెనక్కి తిరిగి చూడరని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వానికైనా సొంత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడుకోవడానికి పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లిలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి రాక్షసుడు అని కొందరు విమర్శిస్తున్నారు. ఆయన రక్షకుడు. బతికున్నంతకాలం రాష్ట్రం ముక్కలు కాకుండా సమైక్యంగా ఉంచారు. రైతులు, పేదలకు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఇందిరమ్మ ఇళ్లు, రూ.లక్ష కోట్లతో నీటి ప్రాజెక్టులను చేపట్టారు. అనేక పరిశ్రమలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించారు. వైఎస్ బతికి ఉంటే ఈ దౌర్భాగ్యం పట్టేది కాదు. మరణించిన వారి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి’ అని హితవు పలికారు.
భాజపా ఎన్ని ఉద్యోగాలిచ్చింది..?