ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kodali Nani criticized Chandrababu: చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కొడాలి నాని - చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని విమర్శలు

తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు(Kodali Nani criticized Chandrababu) చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సతీమణి పేరును అసెంబ్లీలో కానీ బయట కానీ వైకాపా నేతలు ఎక్కడా చెప్పలేదని నాని స్పష్టం చేశారు. నందమూరి కుటుంబం అంటే అందరికీ గౌరవమేనన్న నాని... సీఎం కూడా వారిని గౌరవిస్తారన్నారు.

Minister Kodali Nani
Minister Kodali Nani

By

Published : Nov 26, 2021, 8:04 AM IST

Updated : Nov 26, 2021, 8:56 AM IST

చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కొడాలి నాని

Kodali Nani criticized Chandrababu: రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా.. శవాలపై చిల్లర ఏరుకునేలా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. బాధితులకు బియ్యం, నిత్యావసరాలు, ఇళ్లు దెబ్బతింటే ఇళ్లు, విద్యుత్ ఇలా అన్ని అంశాల్లో చర్యలు తీసుకుంటున్నారన్నారు. తన భార్యను ఎదో అన్నారని సాకులు చెబుతూ చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారని... చంద్రబాబు సతీమణి పేరును అసెంబ్లీలో కానీ బయట కానీ వైకాపా నేతలు ఎక్కడా చెప్పలేదని నాని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడు ఆమె పేరుతో రాజకీయం చేస్తున్నారని(Minister Kodali Nani fire on Chandrababu) ఆరోపించారు. సమస్యలు విడిచి పెట్టి తన సొంత విషయాలు బాధితులకు ఏకరువు పెట్టడం ఏమిటని నాని ప్రశ్నించారు.

వారంతా అమాయకులు

నందమూరి కుటుంబం అంటే అందరికీ గౌరవమేనన్న నాని... సీఎం కూడా వారిని గౌరవిస్తారన్నారు. అయితే వారంతా అమాయకులన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తిని నమ్మి వారు మోసపోయారన్నారు. సీఎం వెళితేనే సమస్యలు పరిష్కారం అవుతాయా అని నిలదీశారు. ఇక్కడి నుంచే సీఎం జగన్ అన్నింటినీ పర్యవేక్షిస్తున్నారని కొడాలి నాని తెలిపారు. రెండు టీఎంసీలు పట్టె బ్యారేజీలోకి 6 గంటల్లో 32 టీఎంసీల నీరు వచ్చిందని, 6 గంటల్లో బయటకు ఎలా పంపించగలం అందులో మానవ తప్పిదం ఏముందని ప్రశ్నించారు. అంత భారీ వర్షం వచ్చింది కాబట్టే ఇంత ఉత్పాతం వచ్చిందన్నారు. అంత భారీ వర్షం వస్తుందని ఎవరు ఉహించగలరని నాని అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కంట్రోల్ చేస్తారు...

జూనియర్ ఎన్టీఆర్ శిష్యులైన మంత్రి కొడాలి నాని, వంశీని... ఆయనే నియంత్రించాలన్న తెలుగుదేశం వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. తమను జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కంట్రోల్ చేస్తారని ప్రశ్నించారు. తామేమైనా ఆయన దర్శకులమా లేక ఆయన దగ్గర నటన నేర్చుకున్నామా అని నిలదీశారు.

ఇదీ చదవండి

నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి : వర్ల రామయ్య

Last Updated : Nov 26, 2021, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details