ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు.. రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు ఇప్పించండి: కొడాలి - ప్రతిపక్ష పార్టీలపై మంత్రి కొాడాలి కామెంట్స్

కరోనా నియంత్రణకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి పూర్తి అవగాహన, బాధ్యత ఉందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.

ప్రతిపక్ష పార్టీలు టీకాలు తెప్పిస్తే రోజుకు 10 లక్షల డోసులు వేయిస్తాం: కొడాలి
ప్రతిపక్ష పార్టీలు టీకాలు తెప్పిస్తే రోజుకు 10 లక్షల డోసులు వేయిస్తాం: కొడాలి

By

Published : May 8, 2021, 3:12 PM IST

Updated : May 9, 2021, 12:09 PM IST

కరోనా మెుదటి వేవ్​లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలకే రూ. 1900 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... అందరికి టీకాలు వేయించేందుకు రూ.1600 కోట్ల కోసం వెనకాడుతుందన్న విమర్శలు సరికాదని మంత్రి కొడాలి నాని అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆ పార్టీ నాయకులు పనికట్టుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వందేళ్ల చరిత్రలో ఇటువంటి వైరస్ మానవ జాతి మీద దాడి చేసిన దాఖలాలు లేవని, దీనిని ఎదుర్కొవడానికి, ప్రజల్ని కాపాడుకోవటానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయని తెలిపారు.

సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం టీకాల విషయంలో వెనకాడుతుందా? అని కొడాలి నాని ప్రశ్నించారు. కేవలం 24 గంటల్లో 6 లక్షల వ్యాక్సిన్ లు పూర్తి చేసిన ఘనత దేశంలో మరే ఏ రాష్ట్రంలో లేదని, ఆంధ్రప్రదేశ్ కే ఉందన్నారు. కొవిడ్ టీకా విధి విధానాలను కేంద్రం రూపొందించిందని చెప్పారు. ఆ కంపెనీలకు ముఖ్యమంత్రి లేఖలు రాశారని, ఫోన్ లు చేసి మాట్లాడారని కొడాలి నాని అన్నారు. 1600 కోట్లు కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వ్యాక్సిన్లు సరఫరా చేస్తే రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ లు వేయటానికి ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా ఉందన్నారు. రాష్ట్రాన్నికి అవసరమైన వ్యాక్సిన్ ను తెప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించాలని కోరారు.

చంద్రబాబు సింగపూర్ నుంచి తెప్పించుకుని మూడు డోస్ ల వ్యాక్సిన్ వేయించుకున్నారని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబుకు రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు ఇప్పించే శక్తే ఉంటే.. రూ.1600 కోట్లు మాత్రమే కాదు, కమీషన్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈరోజు ఈ పరిస్థితికి, కరోనా విజృంభించడానికి చంద్రబాబు, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కారణమని మంత్రి కొడాలి నాని విమర్శించారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు.. 10కి చేరిన మృతుల సంఖ్య!

Last Updated : May 9, 2021, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details