ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం జగన్ ట్రిగ్గర్ నొక్కితే 175 మంది ఎమ్మెల్యేలు గెలవడం ఖాయం' - వైకాపా అభ్యర్థి తరపున వాంబేకాలనీలో మంత్రి కొడాలి, ఎమ్మెల్యే మల్లాది ప్రచారం

విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కొడాలి నాని, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు పాల్గొన్నారు. వాంబే కాలనీలో వైకాపా అభ్యర్థి బేవర సూర్యమణి తరపున ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పురపోరులో తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

minister kodali nani municipal elections campaign at vijayawada
విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని

By

Published : Mar 1, 2021, 7:47 AM IST

వైకాపా అభ్యర్థి బేవర సూర్యమణి తరపున.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, స్థానిక ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ వాంబే కాలనీలోని ప్రధాన వీధిలో ర్యాలీ చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన 300 మంది కార్యకర్తలు.. మంత్రి సమక్షంలో వైకాపాలో చేరారు.

విజయవాడలో రూ. 600 కోట్ల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు విజయాన్ని కట్టబెడతాయని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ గన్​లో బుల్లెట్లు లేవన్న నారా లోకేశ్ విమర్శలపై ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి ఒకసారి ట్రిగ్గర్ నొక్కితే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారని గుర్తుచేశారు. 2024లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో 175 మంది శాసనసభ్యులు గెలవడం ఖాయమన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details