ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kannababu: 'ప్రభుత్వ నిర్ణయాలతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకులన్నీ లాభాల్లోకి వచ్చాయి'

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో.. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులన్నీ లాభాల్లోకి వచ్చాయని మంత్రి కన్నబాబు తెలిపారు. అప్కాబ్‌(APCOB)లోని ప్రతి రూపాయి రైతు కష్టంతో వచ్చిందేనన్న ఆయన.. బాధ్యతగా, నిజాయితీగా వాటిని కాపాడాల్సి ఉందన్నారు. ఆప్కాబ్ ఛైర్మన్‌గా ఎన్నికైన మల్లెల ఝాన్సీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.

minister kannababu speaks over cooperative banks
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులన్నీ లాభాల్లోకి వచ్చాయి

By

Published : Jul 31, 2021, 3:50 PM IST

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో.. రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులన్నీ లాభాల్లోకి వచ్చాయని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు(kannababu) అన్నారు. ఈ ఏడాది రూ.31 వేల కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆప్కాబ్(APCOB) ఛైర్మన్‌గా ఎన్నికైన మల్లెల ఝాన్సీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. సహకార శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్న మంత్రి.. ఆడిట్ విధానాన్ని బలోపేతం చేసినట్లు చెప్పారు.

ఆప్కాబ్‌లోని ప్రతి రూపాయి రైతు కష్టంతో వచ్చిందేనన్న ఆయన.. బాధ్యతగా, నిజాయితీగా వాటిని కాపాడాల్సి ఉందన్నారు. నిధుల దుర్వినియోగం, విధుల పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details