రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి వరి విత్తనాల పంపిణీ చేపడతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ నెల 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. మార్కెట్ స్థితిగతులకు అనుగుణంగా వ్యవస్యాయ సలహా మండళ్ల సూచనలతో త్వరలో పంటల ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ప్రత్యామ్నాయ, లాభసాటి పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. జూన్ 17 నాటికి వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జూన్ ఒకటి నుంచి వరి విత్తనాల పంపీణీ: మంత్రి కన్నబాబు - agriulture minister kannababu news
వ్యవసాయ, ఉద్యాన, ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నతాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. జూన్ ఒకటి నుంచి రాష్ట్రంలో వరి విత్తనాల పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. జూన్ 17 నాటికి వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి కన్నబాబు సమీక్ష