ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇతర జాతీయ ప్రాజెక్టులపై వైఖరినే పోలవరంపై అనుసరించాలి' - పోలవరంపై కన్నబాబు కామెంట్స్

రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే కేంద్రానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు ఇచ్చేందుకు సిద్ధమని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. జాతీయ ప్రాజెక్టుగా సవరించిన అంచనాలను ఆమోదించాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని తెలిపారు.

'ఇతర జాతీయ ప్రాజెక్టులపై వైఖరినే పోలవరంపై అనుసరించాలి'
'ఇతర జాతీయ ప్రాజెక్టులపై వైఖరినే పోలవరంపై అనుసరించాలి'

By

Published : Oct 27, 2020, 8:22 AM IST

దేశంలోని ఇతర జాతీయ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ఏ వైఖరి అవలంబిస్తోందో అదే వైఖరిని పోలవరం ప్రాజెక్టు పట్లా అనుసరించాలని మంత్రి కన్నబాబు అన్నారు. కేంద్ర జల సంఘం ఆమోదించిన మొత్తాన్ని అయినా చెల్లించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. ఈ విషయంపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. మరోవైపు 2014లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం నుంచి చంద్రబాబు లాక్కున్నారని మంత్రి ఆరోపించారు. అందుకే కేంద్రం ఇప్పుడు కప్పదాటు మాటలు మాట్లాడుతోందని పేర్కొన్నారు. పోలవరానికి పూర్తి స్థాయి నిధులు ఇవ్వమని కేంద్రం చెప్పటానికి కారణం తెదేపానే అని కన్నబాబు విమర్శించారు.

ప్రమాదం తప్పినందుకు సంతోషం..

డ్రైవింగ్ రాకుండా ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి గురైనా టీడీపీ నేత నారా లోకేష్ తో పాటు ఆయన అనుచరులకు ప్రమాదం తప్పినందుకు సంతోషమని రాష్ట్ర మంత్రి కె.కన్నబాబు వ్యాఖ్యానించారు. ఆయనకు డ్రైవింగ్ చేయడం చేతకాకే ఆయన పార్టీ టీడీపీ దారితప్పిందని మంత్రి ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:కేంద్రం కొర్రీపై నవంబరు 2న అత్యవసర భేటీ

ABOUT THE AUTHOR

...view details